ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

SMTV Desk 2018-10-24 13:07:58  Andraprades governament,high court,tdp,janasena

విజయవాడ, అక్టోబర్ 24: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు పంపింది.మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ప్రస్తుతం వున్న స్పెషల్ ఆఫీసర్ల పాలనపై వ్యతిరేఖంగా మజీ సర్పంచ్ లు దాఖాలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు పై స్పందించిన చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ల అంశం తేలిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు .
అంతేకాకుండా స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 90ని కోర్టు కొట్టివేసింది.



ఏపీలో దాదాపు 12వేల 880 గ్రామ పంచాయితీలు... లక్షా 30వేల 870 వార్డులు ఉన్నాయి. ఆగస్టులోనే సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో...ఏపీ సర్కార్ ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీవో జారీ చేసింది. సాధారణ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే కోర్టు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో...వోటర్ల జాబితాను సిద్దం చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే హై కోర్టు తీర్పు పై జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది.స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామన్న జనసేన... మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది.