సునామీ మృతుల సంఖ్య పెరుగుతోంది

SMTV Desk 2018-09-30 16:10:19  Indonesia, Indonesia tsunami

ఇండొనేసియాలో సునామీ మృతుల సంఖ్య పెరుగుతోంది. సులావెసీ ద్వీపంలో వచ్చిన సునామీతో మొత్తం 832 మంది చనిపోయినట్టు గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 10 అడుగుల ఎత్తున ఎగసిపడిన రాకాసి అలలు ప్రజల్ని అమాంతం మింగేశాయి. అలా చనిపోయిన వారి మృతదేహాలు ఇప్పుడిప్పుడే బయటకు కొట్టుకు వస్తున్నాయి. సముద్రం ఒడ్డున అక్కడక్కడ మృతదేహాలు కనిపిస్తున్నాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధుల డెడ్ ‌బాడీలు నీళ్లలో ఉబ్బిపోయి కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం మొత్తం హృదయ విదారకంగా మారింది.