ట్రంప్‌ కు మరోసారి ఎదురుదెబ్బ

SMTV Desk 2017-07-19 15:24:49  trump, obhaamaa, senet, mejaarity, seneters

వాషింగ్టన్, జూలై 19 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఒబామా కేర్‌ స్థానంలో తీసుకురాదలచిన కొత్త ఆరోగ్య సంరక్షణ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టటంలో విఫలమయ్యారు. తను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటైన ఆరోగ్య సంరక్షణ బిల్లును సాకారం చేయాలన్న ట్రంప్‌ యత్నం బెడిసికొట్టింది. దీనికి సొంత పార్టీకి చెందిన రిపబ్లిక్ సెనేటర్లే కారణమని నిందిస్తూ ట్రంప్ వరుసగా ట్వీట్లు చేశారు. సెనేట్‌లో బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ 51 కాకుండా 60 ఓట్లు తప్పనిసరిగా రావాలన్న ఫిలి బస్టర్‌ నిబంధనలనూ తొలగించాలని ట్రంప్‌ కోరుతున్నారు. కాగా ఒబామాకేర్‌లో కొన్ని నిబంధనలను మార్చటానికి కూడా 60 మంది మద్దతు అవసరం కావటంపై ట్రంప్‌ మండిపడుతున్నారు.