ప్రతి ఇంటికి నవరత్నాలు చేరాలి

SMTV Desk 2018-09-11 16:11:25  YS Jaganmohan reddy, Vishakapatnam, Padayatra, Vishakapatnam, YSR Congress party

* విశాఖపట్నం విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం: పాదయాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా .‘నవరత్నాలు’ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇంటింటికి నవరత్నాలను చేర్చాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. నవరత్నాలతో ప్రతీ కుటుంబానికి ఎలాంటి మేలు కలుగుతుందనే అంశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని జగన్‌ పేర్కొన్నారు. ప్రజలందరి నోళ్లలో నవరత్నాలు నానేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలకు కార్యకర్తలందరు సిద్ధంగా ఉండాలని, సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని అన్నారు. వారానికి ఐదు రోజుల పాటు ఆయా బూత్‌లకు చెందిన కార్యకర్తలు ఆయా కుటుంబాలతో మమేకం కావాలని ఆదేశించారు.