వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయండం దారుణం

SMTV Desk 2018-09-01 11:26:05  MLA Roja, YSRCP, Veyyi Kalla mandapam, Hyderabad High court

తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయండం దారుణం అని ఎమ్మెల్యె రోజా అన్నారు. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విషయాన్ని చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని హామి ఇచ్చారు.