ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు పడే అవకాశం...

SMTV Desk 2018-07-19 15:45:53  Uttarandhra heavy rains, srikakulam, rgt, amaravathi

అమరావతి, జూలై 19 : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయని ఆర్టీజీ కేంద్రం కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ‌న ప్రభావంతో.. జులై 19 నుంచి 21 వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లపై అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, క‌ర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో తీర ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. అల్పపడీన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, అలల ఉధృతి పెరనుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యం మ‌త్స్యకారులు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.