ఒక్క సెల్ఫీతో కోటి రూపాయల నష్టం!

SMTV Desk 2017-07-16 14:48:39  selfee, youth, death, lakhs, stand, crown, women, currency,

లాస్‌ఏంజిల్స్, జూలై 16 : ఈ కాలం యువతకు సెల్ఫీ ఓ క్రేజ్. వారు ఎక్కడుంటే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం ఓ సెల్ఫీ దాదాపు 2లక్షల డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. 20వేల డాలర్ల ఖరీదు చేసే వస్తువులు సెల్ఫీ కారణంగా ముక్కలు ముక్కలైపోయాయి. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ‘ది 14 ఫ్యాక్టర్టీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనలో హాంకాంగ్‌కు చెందిన కళాకారుడు సిమన్‌ బిర్చ్‌ వినూత్నమైన డిజైన్లలతో తయారుచేసిన కిరీటాలను ప్రదర్శనకు ఉంచారు. వీటిని వీక్షించేందుకు వచ్చిన ఓ యువతి వాటి ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా ఆమె జారి కిరీటాలు ఉన్న స్టాండ్స్‌కు తగలడంతో అవన్నీ ఒకదాని వెంట మరొకటి పడి పగిలిపోయాయి. ఆ కిరీటాల ఖరీదు దాదాపు 2లక్షల డాలర్లు ఉంటుందట. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.28కోట్లు. ఆ కిరీటాలు ఒక్కోదాన్ని తయారు చేయడానికి 20 నుంచి 30 గంటలు పట్టిందట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..అంత ఖరీదైన వస్తువులు పగిలిపోయినా ఆ కళాకారుడు ఆమెను ఏమీ అనలేదట. ఇది కావాలని చేసిన పని కాదు, ఆ యువతి జారి పడటం వల్ల అవి పగిలిపోయాయని అన్నారట. ఇంకా ఆమె దగ్గర నుంచి ఎటువంటి నష్ట పరిహారం తీసుకోలేదని తెలిపారు.