భూమి ఉన్నంత వరకు ఈ జీవి ఉంటుందంటా..!

SMTV Desk 2017-07-16 13:21:22  human being, earth, oxford university, microscope, plant, taardigrade, scientist.

లండన్‌, జూలై 16 : మనుషులు మహా అయితే ఓ 100 ఏళ్ళు బ్రతుకుతారు కాని భూమి ఉన్నంత వరకు బతికి ఉంటారా? ఈ భూమి మీద నివసించే ఏ జీవైన బ్రతుకుతుందా? అసలు అలాంటి ఊహలే లేవంటారా..! ఈ భూమి, సూర్యుడు ఉన్నంతకాలం (సూపర్ నోవా సంభవించే వరకు) జీవించి ఉండే జీవిని యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సగం మిల్లీమీటరు పరిమాణంలో ఉండి, తిండి లేకుండా 30 ఏళ్లు బతకగల ఆ జీవి టార్డిగ్రేడ్‌(నీటి ఎలుగు). ఎనిమిది కాళ్ళు కలిగి ఉండే ఈ సుక్ష్మ జంతువు 1000 కోట్ల వరకు జీవిస్తుందట. ఈ జీవిని అంటార్కిటికా శాస్త్రవేత్తలు నీళ్ళు ఉండే ప్రాంతాలలోని నాచు మొక్కలలో గుర్తించారు. కేవలం మైక్రోస్కోప్‌తోనే స్పష్టంగా చూడగలిగే టార్డిగ్రేడ్‌ ఒకసారి జన్మించిందంటే నాశనం చేయటం కష్టమట. కాగా మనిషి అంతం అయిన తర్వాత కూడా టార్డిగ్రేడ్‌తో సహా మరిన్ని జాతులు జీవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.