ఎక్స్ రే తో ప్రమాదం అంటున్న...

SMTV Desk 2017-07-16 13:02:59  XRAYS ,HARM HEART ,STUDY ,LOW

లండన్, జూలై 16 : శరీరంలోని ఏదైన అవయవాలకు గాయంగాని లేదా ఉబ్బడం లాంటివి జరిగితే, అలానే తలనొప్పని వైద్యుల దగ్గరకి మాత్రలకని వెళితే వారు సందేహంతో ఎక్స్ రే తీయించుకోమని చెబుతుంటారు. ఎదుటి వ్యక్తి ఆందోళన చెంది వెంటనే ఎక్స్ రే చేయించుకుంటారు. ఇదే పరిస్థితి ఈ మధ్య కాలంలో చాలామందికి నెలకొంటుంది. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీటికి మాటికి ఎక్స్‌రేలు తీయించుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని జర్మనీలోని హెల్మోత్ మంచెన్ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు ఓ పరిశోధన నిర్వహించారు. తక్కువ మోతాదు రేడియేషన్ లో గుండె ధమనుల కణజాలం ఏ విధంగా స్పందిస్తుందన్న అంశంపై వారు పరిశోధన చేశారు. తరచూ రేడియేషన్ కు గురికావడం గుండె కణజాలం పనితీరుపై దుష్ప్రభావం చూపుతుందని, గుండె ధమనుల లోపలి పోరలోని కణాల్లో మార్పులు వస్తాయని వీరు గుర్తించారు. రక్తనాళాల్లోని ఎండోథీసియల్ కణాలు తక్కువ పరిమాణంలో నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తాయని, అది రక్తనాళాల సంకోచాలపై ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.