విమానాలల్లో ఇలా చేస్తున్నారా?

SMTV Desk 2017-07-15 17:45:03  DHUBAI, AIRLINES, PASSINGESRS, VIDEO, VINE, JOURNEY.

దుబాయి, జూలై 15 : సుదూర ప్రాంతాలను సులభంగా చేరుకోగలమని ఎంత ఖర్చుపెట్టయినా విమానాల్లో ప్రయాణిస్తోంటే.. ప్రజల భద్రతకు విఘాతం కలిగించేలా విమాన సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. దుబాయికి చెందిన ఎమిరేట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఎంతో కాలంగా చేస్తున్న ఓ నిర్వాకం ఇటీవల బయటపడింది. ప్రయాణీకులు సేవించగా మిగిలిన వైన్‌ను విమాన సిబ్బంది మళ్లీ ఓ బాటిల్‌లోకి పోయడాన్ని ఓ ప్రయాణికుడు చూసి చాటుగా వీడియో తీశాడు. ఆ వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది. కాగా ఇలాంటి చర్యలను ఎమిరేట్ ఎయిర్‌లైన్స్ ఖండించి తమ విమానాల్లో ఇలాంటివి అస్సలు జరగవంటూ బుకాయించింది. మరి ఈ వీడియో సంగతేంటో విమానయాన శాఖ అధికారులే తేల్చాలి.