ఆర్మీ సైన్యాన్ని తగ్గించనున్న చైనా

SMTV Desk 2017-07-12 15:45:19  CHINA , PEOPLES LIBERATION ARMY , CHINESE MILITARY , SOUTH CHINA SEA , INDIA

జింగ్, జూలై 12 : చైనా పునఃనిర్మాణం ప్రక్రియలో భాగంగా మిలిటరీని 23 లక్షల నుంచి ఏకంగా పది లక్షలలోపు తగ్గిస్తున్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అధికార పత్రిక వెల్లడించింది. చైనా చరిత్రలో తొలిసారి తమ మిలిటరీ సంఖ్యను భారీగా తగ్గించనుంది. అయితే ఆర్మీ సంఖ్యను తగ్గించి.. నేవీ మిస్సేల్ బలగాలను పెంచాలని భావిస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది. చైనా వ్యూహాత్మక లక్ష్యాలు, రక్షణ అవసరాలకు అనుగుణంగా ఈ సంస్కరణలు జరుగుతున్నాయి. గతంలో పీఎల్ఏ అర్మీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పుడు నేవీ, ఇతర రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయడానికి ఈ మార్పులు చేస్తున్నది అని ఆ పత్రిక చెప్పింది. చైనా చరిత్రలో తొలిసారి ఆర్మీ సంఖ్యను పది లక్షలలోపు తీసుకొస్తున్నారని తెలిపింది. పీఎల్ఏ నేవీ, పీఎల్ఏ స్టేటజిక్ సపోర్ట్ ఫోర్స్, పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ లలో బలగాల సంఖ్య పెరగనుండగా, పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ లో మాత్రం ఇప్పుడున్న బలగాలే కొనసాగనున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా గతంలో ఆర్మీని మూడులక్షల వరకు తగ్గిస్తున్నట్లు మీడియాకు తెలిపారు.