నేడు బీజేపీ ఆఫీసర్ బేరర్ల భేటి..

SMTV Desk 2018-06-10 12:25:50  ap bjp berares meeting, amaravathi, vijayawada, tdp vs bjp

విజయవాడ, జూన్ 10 : రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆఫీస్ బేరర్ల భేటి నేడు జరగనుంది. విజయవాడలోని ఆళ్లపాటి రామారావు ఫంక్షన్ హాలులో జరిగే ఈ సమావేశానికి ఢిల్లీ నుండి పార్టీ సీనియర్ నేత సతీష్ ఝా హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి వ్యవహారాలు, నేర రాజకీయాలను నిరసిస్తూ రేపు విజయవాడలో భాజపా మహాధర్నా చేపట్టనుంది. దీనిపైనా సమావేశంలో చర్చించనున్నారు. ఆఫీస్ బేరర్లతో పాటు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు హాజరుకానున్నారు. రానున్న మూడునెలల కాలంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అధికార తెలుగుదేశం పార్టీని ప్రజల్లో నిలదీసేందుకు సిద్ధం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వివిధ జిల్లాల్లో చేపట్టబోయే బస్సు యాత్రపైనా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.