137 ఏళ్ల తరువాత ఆడబిడ్డ

SMTV Desk 2017-07-08 19:03:57  karolina, girl birth, about 137 years amerika, karter luise, setel couple

కరోలినా, జూలై 8 : ఎన్నో తరాల తరువాత ఆడపిల్లకు జన్మనిచ్చిన ఓ అమ్మ ... వాస్తవానికి ఆ కుంటుంబంలో గత వందేళ్లుగా ఆడ సంతానమే లేదు. దీంతో ఇటీవలె పుట్టిన ఆడపిల్లను చూసి ఆ కుటుంబ సభ్యులంతా ఎంతో మురిసిపోతున్నారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమెరికాలోని సౌత్ కరోలినాలోని, విల్ కెలెన్, సెటెల్ దంపతులకు జూన్ 25న కార్టెర్ లూయిస్ సెటెల్ జన్మించింది. కెలెన్ కుటుంబంలో ఎన్నో ఏళ్ల నుంచి ఆడపిల్లల సంతానమే కరువైంది. దీంతో ఈ పాపకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తపరిచారు. ఆడ పిల్లలనే వద్దనుకుంటున్న ఈ రోజుల్లో వీరి కుటుంబం మాత్రం, ఆడపిల్లలకై ఎన్నో ఏళ్ల తరబడి తెగ ఎదురు చూశారట.. ఆ ఎదురు చూపు నేడు ఈ పాప ద్వారా ఫలించిందని వారంటున్నారు. దాదాపు 137 ఏళ్ల తరువాత పుట్టిన ఈ అమ్మాయిని చూసి ఆనందం తట్టుకోలేక వారు హోర్డింగుల రూపంలో అందరితో పంచుకుంటున్నారు. సౌత్ కరోలినా హైవేపై పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసి తమ సంతోషాన్నిఈ విధంగా వ్యక్తం చేశారు.