పెన్షన్ తీసుకునే వయస్సు లో ప్రేమ పెళ్ళా?

SMTV Desk 2017-07-08 19:01:36  Marry, again, with, a boy, at, a young, age

ఇంటర్నెట్ డెస్క్, జూలై 8 : పెన్షన్ మొదలవుతుంది, మరి అలాంటి టైంలో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ప్రేమకి వయస్సుతో సంబంధం ఏముంది అంటారా, నిజమే వయస్సుతో పని లేదు కాని ప్రేమికుల మధ్య వయస్సు తేడా కొంత వరకు ఉంటే. ఇక్కడ వింతేమిటంటే ఈ ప్రేమికుల మధ్య వయస్సు తేడా ఏకంగా 55 సంవత్సరాలు. అవాక్కయ్యారా? ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ బామ్మ గురించి తెలుసుకోవాల్సిందే!! పెన్షన్‌ తీసుకునే వయస్సులో ప్రేమలో పడిందో బామ్మ అదీ ఒక బాలుడితో ఎవరెన్ని అనుకున్న తమకెలాంటి ఇబ్బంది లేదంటుంది ఈ జంట. వివరాల్లోకి వెళితే.. ఇండోనేసియాలోని దక్షిణ సుమత్రా ప్రాంతంలోని కరన్‌గెండా గ్రామానికి చెందిన 71 ఏళ్ల రోహయా అనే మహిళ,16 ఏళ్ల సేలమత్‌ రియాదితో ప్రేమలో పడింది. రోహయాకు ఇదివరకే రెండు పెళ్లిలయ్యాయి. అంతే కాదు.. ఆమెకు 19 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబసభ్యులు తమ పరువు పోతుందని వీరి పెళ్లికి అంగీకరించలేదు. సేలమత్‌ మాత్రం తన కుటుంబసభ్యులను అతికష్టంపై ఒప్పించగలిగాడు. 71 ఏళ్ల మహిళకు16 ఏళ్ల యువకుడితో పెళ్లి అనగానే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది తరలి వచ్చి వారి పెళ్లికి మద్దతు తెలిపారు. కరన్‌గెండాలోని ఓ గ్రామపెద్ద సహకారంతో వీరిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.