ట్రంప్ కు మరో పరాభవం

SMTV Desk 2017-07-08 12:30:18  amerika president tramp, wife molaniya, andreje, wife waarsa social media, cemera

వార్సా, జూలై 8: ట్రంప్ పై మీడియా దృష్టి గట్టిగానే తగిలినట్లుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇటీవల ఆయన ఎక్కడికి వెళ్లిన దేశ అధ్యక్షుడిగా కెమెరా ముందు రావడం సాధారణమే కానీ, ఆయన కెమెరా ముందుకు వచ్చిన ప్రతిసారి నవ్వుల పాలై పరాభావాన్ని ఎదుర్కొంటున్నారు. విషయంలో కి వెళితే...ఈ మధ్య కాలంలో యూఏఈ పర్యటన జరిగిన సందర్భంగా ట్రంప్ దంపతులు హాజరయ్యారు. ట్రంప్ తన సతీమణీ మెలనియా ట్రంప్ చేయిపట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె విసిరి కొట్టింది. ఇది చూసిన వాళ్లంతా కూడా తెగ నవ్వుకున్నారు. కాగా జీ 20 సదస్సులో భాగంగా గురువారం పోలాండ్ కు చెందిన వార్సాలో అడుగుపెట్టిన ట్రంప్ కు మరోసారి అదే సీన్ రిపీటయింది. ఈసారి మాత్రం మరో వ్యక్తి ద్వారా ట్రంప్ పరాభావాన్ని ఎదుర్కొన్నారు. వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు ఆయన భార్యను కలుసుకున్న సందర్భంగా తొలుత పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్ ప్రక్కనే పోలాండ్ ప్రథమ మహిళ అగట కార్న్ హౌషర్ ఉన్నారు. మొదట ఆండ్రేజ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్ వెంటనే అగట ఆయన వైపుకు వెళ్లడంతో ట్రంప్ తొందర పాటు ఆలోచనతో షేక్ హ్యాండ్ ఇస్తుందని చేయి సాచారు. కానీ ఆమె అనూహ్యంగా ట్రంప్ కు ఇవ్వకుండా ఆయన భార్య మెలనియాకు ఇచ్చారు. దీంతో అవాక్కయిన ట్రంప్ యొక్క హావభావాలు విచిత్రంగా కనిపించాయి. ఇది చూసిన కెమెరాలు నవ్వుకున్నాయి. తిరిగి మెలనియా నుంచి ట్రంప్ వైపుకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వగా ట్రంప్ నైస్ టూ మీట్ యూ అంటూ అక్కడి నుంచి వెళ్లారు. ఈ మేరకు సోషల్ మీడియా ఆయన పెట్టిన హావభాలతో ఉన్న వీడియోను జిఫ్ ఫార్మాట్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు.