పరిశ్రమల స్థాపనతో వేల మందికి ఉపాధి: బాబు

SMTV Desk 2018-05-10 16:12:05  ap cm chandrababu naidu, tour in Kurnool

కర్నూలు, మే 10: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు గుట్టపాడు సమీపంలో జయరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకానుందని, తద్వారా 5 వేల మంది యువతకు ఉపాధి లభించనుందని సీఎం చెప్పారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని ఆయన అన్నారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తర్వాత ఉర్దూ వర్సిటీ, రూసా క్లస్టర్ వర్సిటీలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.