వేలానికి గాంధీజీ పెన్సిల్ స్కెచ్

SMTV Desk 2017-07-07 19:41:48  The famous artist John Henry Ammshitz, gandhi, London Round Table,Pencil sketch auction

లండన్, జూలై 7 : ప్రముఖ కళాకారుడైన జాన్ హెన్రీ ఆమ్ష్‌విట్జ్ గీసిన గాంధీజీ పెన్సిల్ స్కెచ్‌ను ఈనెల 11న లండన్‌లో వేలానికి ఉంచనున్నారు. 1931లో గాంధీజీ లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లినప్పుడు ఆమ్ష్‌విట్జ్ ఈ స్కెచ్‌ను గీశారు. గాంధీజీ నేలపై కూర్చుని రాసుకుంటున్న దృశ్యాన్ని చూసి ఆ చిత్రకారుడు స్కెచ్‌గా మలిచారు. అనంతరం ఈ స్కెచ్‌ను చూసిన గాంధీ దానిపై సత్యమే దేవుడు.. అని రాసి సంతకం చేశారు. ఈ మేరకు రూ.6.72 లక్షల నుంచి రూ.10.09 లక్షల వరకు ఈ స్కెచ్ అమ్ముడుపోవచ్చని వేలం నిర్వహించే సంస్థ సాతెబీ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పట్లో శరత్‌చంద్ర బోస్‌కు, ఆయన కుటుంబానికి గాంధీ రాసిన లేఖలను కూడా వేలం వేయనున్నట్లు సమాచారం.