ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు..

SMTV Desk 2018-05-07 11:09:34  CHANDRABABU NAIDU, BAREBDRAMODI, AP CM LETTER TO PM.

అమరావతి, మే 7 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబు పలు అభ్యంతరాలను వ్యక్తపరిచారు. ఈ లేఖలో.. రైతన్నలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అమలు పతాకాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో "జనాకర్షక పథకాలపై సమీక్ష" అనే అంశం, విద్యుత్‌ చట్టం- 2003కు సవరణ ప్రతిపాదించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతన్నలకు మేలు కలిగేలా కనీస మద్దతు ధర నిర్ణయించాలని, వరితో పాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని సూచించారు. అలాగే పంటల బీమా నిబంధనలో పలు మార్పులు అవసరమని చంద్రబాబు ఆ లేఖలో ప్రధానికి విన్నవించారు.