సకాలంలో ప్రాజెక్టులను పూర్తిచేయాలి: చంద్రబాబు

SMTV Desk 2018-05-04 13:10:17  CM Chandrababu CRDA Amaravati Construction

అమరావతి, మే 4: రాజధాని అమరావతిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్ని సకాలంలో పూర్తిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రారంభించిన పనులు నిర్దేశిత కాలవ్యవదిలో పూర్తిచేయకుంటే సమస్యలొస్తాయన్నారు. గురువారం సచివాలయంలో ఆయన సీఆర్‌డీఏ ప్రాజెక్టులు, రాజధానిలో స్థలాలు పొందిన యూనివర్సిటీలు, వైద్య, ఆరోగ్య సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి వారితో మాట్లాడారు. ఆనంద నగరాల సదస్సు నిర్వహణ తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై చర్చించారు.