బాలకృష్ణ దిష్టిబొమ్మ దగ్దం

SMTV Desk 2018-04-23 12:08:13  PM Modi MLA balakrishna BJP CM Chandrababu Naidu Anantapur

అనంతపురం, ఏప్రిల్ 23: ప్రధాని న రేంద్రమోదీ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద ఆయన దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ నీచమైన భాషతో ప్రధాని మోదీని తిట్టిపోసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని, సాక్షాత్తు ప్రధానిపై చౌకబారు మాట లు మాట్లాడి నవతరానికి ఏం సందే శం ఇవ్వదలచుకున్నారని బీజేపీ నాయకులు ప్ర శ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వ తం కాదని వ్యక్తిగత విమర్శలు మా నుకోవాలని సూచించారు.