మహాభారతం లో సీత!!

SMTV Desk 2017-07-05 16:33:58  nayanatata, maha bharatham, mohanlal

హైదరాబాద్, జూలై 05 : దర్శకుడు కుమార్ మీనన్, బీ. ఆర్. శెట్టి నిర్మాణంలో రూపొందించనున్న భారీ బడ్జెట్ చిత్రం "మ‌హా భార‌తం". భారతీయ సినీరంగ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో రూ. 1000 కోట్ల వ్యయంతో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో ఇప్పటికే ఓ ప్రధాన పాత్రకి మోహన్ లాల్ ని ఎంపిక చేయగా, మిగిలిన పాత్రల కోసం ప్రభాస్,నాగార్జున, మహేష్‌ ఇంకా కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే మహాభారతంలోని స్త్రీ పాత్రలలో ముఖ్యమైన పాత్ర ద్రౌపది. ఈ ద్రౌపది పాత్ర కోసం నయనతారని ఎంపిక చేసారని సినీవర్గాలు చెబుతున్నాయి. చారిత్రాత్మక చిత్రంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార అయితేనే ద్రౌపది పాత్రకి సరిగ్గా సరిపోతుందని ఆ చిత్ర యూనిట్ భావిస్తున్నారట. నయనని కలిసి పాత్ర గురించి కూడా వివరించగా, దీనికి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలింనగర్ సమాచారం. కన్నడలో కూడా మహా భారతం నేపథ్యంలోనే "కురుక్షేత్ర" అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా దర్శకుడు రాజమౌళి కూడా మహా భారతం నేపథ్యంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.