9 ఏళ్ల బాలిక పై అత్యాచారం

SMTV Desk 2017-07-04 12:29:16  9, years, child, rape,

నాగోల్, జూలై 04 : ఇటీవల కాలంలో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు చాలా పెరుగుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళ పై కొందరు అఘంతకులు ఈ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నాగోల్ లో ఓ 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం జరిగిన ఘటన ఎల్బీ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి నాగోల్ లోని అద్దింట్లో నివాసముండేవాడు ఓ వ్యక్తి. అయినకి ఒక కుమారుడు (12) మరియు ఒక కుమార్తె (9). బ్రతుకు దెరువు కోసం కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి సమీప బంధువైన వెంకటేష్ (40) ఇంట్లో ఎవరు లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేసాడు. తరువాత బాలికను అనాధ ఆశ్రమానికి పంపించగా అక్కడ ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని తెలుసుకోగా వారు ఎల్బీ నగర్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు మేరకు వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.