మానసిక ఒత్తిడే కారణమట!!!

SMTV Desk 2017-07-02 14:40:38  suicide, in apartment

కొండాపూర్, జూలై 02 : ఈ మధ్య కాలంలో అప్పుల బాధలు, మానసిక ఒత్తిళ్ళు ఇలా చాలా కారణాల వలన ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనే కొండాపూర్ లో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశాల్ టండన్ (43) హైదరాబాద్ చందానగర్ నల్లగండ్ల అపర్ణ సరోవర్ లో ఎఫ్ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 14 బి3 లో విశాల్ తన తల్లి రామ్ నాథ తో కలిసి ఉంటున్నాడు. విశాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చదువుతున్నాడు. సున్నితమైన మనసత్వం గల విశాల్ గత కొంతకాలంగా తల నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. విశాల్ తల్లి నెల రోజుల క్రితం సొంత ఉరికి వెళ్ళడం తో ఇంట్లో ఒక్కడే ఉంటున్న విశాల్ ఆనారోగ్య సమస్యల వల్ల మానసిక ఒత్తిళ్లకు లోనయ్యాడు. శనివారం తను ఉంటున్న అపార్టుమెంట్ 14 అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాల్ మానసిక ఒత్తిళ్ళకు తట్టుకోలేక చనిపోతున్నట్లు తన సోదరికి మెయిల్ చేసాడని పోలీసులు వెల్లడించారు.