స్నేహం పేరుతో అత్యాచారం

SMTV Desk 2017-07-01 15:10:02  sr nagar, krishna, rape, atemptu, in, bus

హైదరాబాద్, జూలై 1 : ఇటీవల కాలంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. స్నేహం పేరుతోనూ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే అమీర్ పేట్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒంగోలుకు చెందిన గొట్టిముక్కుల కృష్ణ (28) అమీర్ పేట్ మైత్రివనం గాయత్రి నగర్ లోని అమ్మాజీ నిలయంలో ఉండేవాడు. సాఫ్ట్‌వేర్‌ శిక్షణకు వచ్చి అదే ప్రాంతంలోని లేడీస్‌ హాస్టల్‌లో ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన యువతి(23)తో నెల రోజులు క్రితం పరిచయం పెంచుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం అమ్మాయి వాళ్ళ నాన్నకు అనారోగ్యంగా ఉంటే ఆమె నెల్లూరు కు వెళ్ళింది. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న క్రిష్ణ కూడా నెల్లూరుకు వెళ్ళాడు. అతను అమ్మాయి వాళ్ళ నాన్నతో పరిచయం పెంచుకున్నాడు. మళ్ళీ హైదరాబాద్ బయలుదేరేందుకు ఆ యువతి అతన్ని ఆర్టీసి టికెట్ తీసుకోమని చెబితే, అతను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ లో టికెట్ బుక్ చేశాడు. ఇద్దరు బస్సు లో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేస్తూ చరవాణిలో చిత్రీకరించాడు. హైదరాబాద్ కు వచ్చాక ఈ ఫోటోలను నెట్లో పెడుతానని బెదిరించి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి, బంగారు ఆభరణాలు, 10 వేలు నగదు లాక్కున్నాడు. ఇవన్నీ భరించలేక యువతి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు క్రిష్ణ ను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, ఫోటోలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.