నీటిలో మునిగిపోతున్నాడని తెలిసి కూడా...

SMTV Desk 2017-06-27 17:36:07  friend, kundan, swimming, death, friend, video

ఢిల్లీ, జూన్ 27 : నదిలో స్నేహితుడు మునిగిపోతుంటే మరో స్నేహితుడు మొబైల్ వీడియో తీసిన సంఘటన ఉత్తరాఖండ్ లోని హృషికేష్ లో చోటు చేసుకుంది. అమన్ విహార ప్రాంతానికి చెందిన కుందన్ స్నేహితులతో కలిసి హృషికేష్ వెళ్లారు. స్నేహితులంతా రాప్టింగ్ కు వెళ్దాం అన్నారు. కాని కుందన్ మాత్రం నేను గంగలో పుణ్య స్నానం చేస్తాను అన్నాడు. కుందన్ మొబైల్ స్నేహితుడికి ఇచ్చి నేను నదిలోకి వెళ్ళే ముందు వీడియో తీయమని చెప్పాడు. అతనికి ఈత రాక పోవడంతో తాడు పట్టుకొని నదిలోకి దిగాడు. నదిలో స్నానం చేస్తున్న కుందన్ ఒక్క సరిగా మునిగిపోయాడు. నదిలో ఈత రాక కుందన్ అల్లాడుతున్న కూడా స్నేహితుడు వీడియో తీస్తూనే ఉన్నాడు. దీంతో కుందన్ నదిలో మునిగిపోయాడు. నదిలో ముగిపోయిన కుందన్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.