చిన్నారిని మింగేసిన బోరు బావి

SMTV Desk 2017-06-25 12:13:41  chinnari veena, borwel, rescuer, oparation, failed

రంగారెడ్డి, జూన్ 25 : రంగారెడ్డి జిల్లా చన్ వెళ్లి గ్రామంలో బోరు పడిన చిన్నారి కథ చివరికి విషాదంతో ముగిసింది. చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. రంగారెడ్డి జిల్లా చన్ వెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరు బావిలో పడిన చిన్నారిని కాపాడటానికి సహాయక సిబ్బందిని, ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలను పలు ప్రాంతాల నుంచి రప్పించి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొదటగా 40 అడుగుల దూరంలో మోటారు వద్ద ఉండటంతో చిన్నారి అరుపులను తల్లిదండ్రులకు, అధికారులు వినిపించారు. 200 అడుగుల దగ్గర చిన్నారి ఉన్నదని కెమెరాలను లోపలి పంపించి చుస్తే కనిపించలేదు. చిన్నారి మరింత లోతులో ఉన్న 400 అడుగులలో ఉన్న ఉబికి చిక్కుకొని చనిపోయిందనుకున్నారు. ఆ బోరు బావిలో నుంచి దుర్వాసన రావడంతో మరణించినట్లు గుర్తించారు. గాలి పైపు ద్వార చిన్నారి అవయవాలు, బట్టలు బయటకు వచ్చాయి. దాదాపు 60 గంటలు, 100 మందికి పైగా సిబ్బంది. 3 రోజులను నుంచి రాత్రి, పగలు అని తేడా లేకుండా చిన్నారిని బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు అన్నివిఫలమయ్యాయి. 108 సిబ్బంది. అగ్నిమాపక సిబ్బంది. జేసిబి లు 3 రోజులు నుంచి చేసిన శ్రమ ఫలించలేదు. తన కూతురు ప్రాణాలతో బయటకు వస్తుందని ఆశించిన తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. చిన్నారి మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగారు. చిన్నారి అవయవాలను పోస్టు మార్టం చేసిన తరువాత గోరెపల్లి గ్రామంలో చిన్నారి అంత్య క్రియలు నిర్వహించారు.