పంచకులలో తీవ్ర ఉద్రిక్తత.. ఐదుగురి మృతి..

SMTV Desk 2017-08-25 18:35:29  BABA GURMITH SINGH, PANJAB, HARYANA, PANCHAKULA, VOILENCE, 5 MEMBERS DIED

చండీఘడ్, ఆగస్ట్ 25 : అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ను దోషిగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చిన నేపధ్యంలో పంజాబ్, హ‌ర్యానా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. బాబా మద్దతు దారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతూ, భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. పంచకులలో ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ, అగ్నిమాపక యంత్రానికి, అక్కడే ఉన్న కార్లకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఇక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు ఆ ప్రాంతానికి అదనంగా 600 మంది సైనికులను తరలించారు. అంతేకాకుండా మీడియా వాహనాల అద్దాలను పగులగొట్టారని ఓ మీడియాకు చెందిన ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు వీరి నిరసన దేశ రాజ‌ధాని ఢిల్లీని కూడా తాకింది. అక్కడ కూడా రెండు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని రైల్వే స్టేషన్లు, సరిహద్దుల్లో భద్రతను పెంచారు. డోన్లు, హెలికాఫ్టర్లతో నిఘా కొనసాగిస్తున్నారు.