కన్న కూతుర్ని వ్యభిచారంలోకి దించిన తల్లి

SMTV Desk 2017-08-18 17:45:52  mother forced daughter for prostitution, mother boyfriend, daughter marriage

విజయవాడ, ఆగస్ట్ 18: ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటనలు చూసాము. ప్రియుడి కోసం పిల్లల్ని కడతేర్చిన కసాయి తల్లుల్ని చూసాము. కాని ప్రియుడి కోసం కన్న బిడ్డను వ్యభిచారంలోకి దించిన కసాయి తల్లి కరకసత్వం ఇప్పుడు బయటపడింది. నవ మాసాలు మోసిన బిడ్డ కన్నా ప్రియుడే ఎక్కువనుకుంది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే వ్యభిచార గృహానికి అమ్మేసింది ఓ తల్లి. బెజవాడ శివారులోని పైకపురం, ఉడా కాలనీ లో చోటు చేసుకుంది ఈ దారుణం. మూడు నెలలు నరకం అనుభవించిన 14 ఏళ్ళ బాలిక అతి కష్టం మీద పోలీసులను ఆశ్రయించడం తో విషయం బయట పడింది. పైకపురానికి చెందిన గొట్టం మని భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది. కొంత కాలంగా మల్లికార్జున్ తో సహజీవనం చేస్తుంది. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన తో క్రురంగా వ్యవహరించింది. ప్రియుడు ఇచ్చిన సలహాతో కూతురిని వ్యభిచారంలోకి దించింది. మూడు నెలల పాటు వ్యభిచారం చేయించింది. వచ్చిన డబ్బులు చాలక కూతుర్ని వ్యభిచార గృహానికి అమ్మేసింది. కూతురు వ్యభిచార గృహం నుండి తప్పించుకుందని తెలుసుకున్న తల్లి కూతురు తప్పి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు స్తానికంగా పరిచయం ఉన్న లీలకృష్ణ ను ఆశ్రయించింది. అతడిని పెళ్లి చేసుకుంది. అయితే, బాలిక మైనారిటీ తీరకపోవడంతో మరో చిక్కు వచ్చింది. చివరకు బాలిక పోలీసులను ఆశ్రయించడంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. కసాయి తల్లి తో పాటు ఆమె ప్రియుడిని బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిని అరెస్ట్ చేసారు పోలీసులు. బాలిక తప్పిపోయిందని పోలీసులకు తల్లి తప్పుడు ఫిర్యాదు ఇవ్వడం, పోలీసులనే తప్పు దోవ పట్టించడంతో ఈ కేసును చేధించేందుకు పోలీసులకు మూడు నెలల సమయం పట్టింది. బిడ్డకు ఏదయినా జరిగితే తల్లడిల్లాల్సిన తల్లే కూతుర్ని వ్యభిచార కూపంలోకి పంపడం స్థానికంగా సంచలనంగా మారింది.