మెహదీపట్నం లో విషాదం

SMTV Desk 2017-08-16 12:47:18  labours death, construction building, mehadipatnam

హైదరాబాద్, ఆగస్ట్16: చేత పట్టుకొని నగరానికి వచ్చిన ఇద్దరు కూలీలు నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి పడి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మెహదీపట్నం లోని అయోధ్యనగర్ లో చోటు చేసుకుంది. మృతులను నగేష్, కృష్ణ లుగా గుర్తించారు. వీరిలో కృష్ణ మహబూబ్ నగర్ నవాబ్ పేట వాసి కాగా నగేష్ మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన వాడు. స్థానికుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి కారణం భవన నిర్మాణ లోపమేనని ప్రాథమికంగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా భవన నిర్మాణానికి వాడిన సామాగ్రి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం కూడా మరో కారణం అంటున్నారు. అయితే, పోలీసులు ఎంత ప్రయత్నించిన బాధితులు మాత్రం మృత దేహాల్నికదల్చడానికి వీల్లేదని పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. బిల్డర్ వచ్చి వారికి సమాధానం చెప్పేదాక అక్కడి నుండి కదిలేదిలేదని మృతుల బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.