మత్తు ఇంజక్షన్ తీసుకొని మెడికో ఆత్మహత్య

SMTV Desk 2017-08-16 11:46:29  savita, medico suicide, nirmal

నిర్మల్, ఆగస్ట్ 16: మత్తు ఇంజక్షన్ తీసుకొని మెడికో ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా లో సంచలనం సృష్టించింది. కాగా ముథోల్‌లోని మహాలక్ష్మి కాలనీకి చెందిన సవిత హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల లో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇటీవల సెలవులు రావడంతో మూడు రోజుల క్రితం ఆమె స్వగ్రామానికి చేరుకుంది. అయితే, గదిలో ఒంటరిగా ఉన్న సవితను పలకరించటానికి కుటుంబ సభ్యులు వెళ్ళగా, ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. హై డోస్ మత్తు ఇంజక్షన్ చేసుకోవటం వలనే ఆమె మృతి చెందినట్టు వైద్యులు అంటున్నారు. అయితే, ఆత్మహత్య కు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. సవిత కి ఇటీవలే వివాహం నిశ్చయం అయ్యింది. ఆమె ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.