లారీ లో దోపిడీ

SMTV Desk 2017-07-14 13:05:18  Lorry, threatens, the, driver, and, spoil, the, cash

మొయినాబాద్, జూలై 14 : హైదరాబాద్ శివారులో దుండగులు లారీ డ్రైవర్ వద్ద నగదు లాక్కుని పరారైన ఘటన మొయినాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గురువారం కర్ణాటక నుంచి వరంగల్ కు లారీలో సిమెంట్ లోడ్ తో వెళ్తూ, రాత్రి అవడంతో కనకమామిడి గ్రామం సమీపంలో డ్రైవర్ లారీ ఆపి నిద్రిస్తున్నారు. అదే సమయంలో దుండగులు కత్తులతో లారీ లోనికి ప్రవేశించి డ్రైవర్, క్లీనర్ లను బెదిరించి వారి వద్ద రూ. 22 వేల నగదు లాక్కుని పరారైయ్యారు. వాళ్ళు వెళ్లిన వెంటనే డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నిందితులు వేసుకొచ్చిన వాహనం నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని వెంబడించారు. అందులో ఒకరు దొరుకగా మరో ఇద్దరు పారిపోయారు. దొరికిన నిందితుడు హైదరాబాద్ లోని టోలి చౌకి కి చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.