మిక్సీలో బంగారం...!

SMTV Desk 2017-07-14 11:44:50  MIXI, GOLD, AEROPIANE, POLICE, DRI DIPORTMENT, WOMEN.

హైదరాబాద్, జూలై 14 : మిక్సీ మధ్యలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మహిళను శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. విమానంలో అబూదాబి నుంచి హైదరాబాద్‌ వస్తున్న మహిళ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందడంతో అలర్ట్ అయిన పోలీసులు ఆ విమానంలో ఉన్న వారందరినీ తనిఖీ చేశారు. వారిలో ఒక మహిళ మిక్సీ తెస్తుండటంతో అనుమానం వచ్చి పోలీసులు దాన్నితనిఖీ చేయగా.. మిక్సీలోని మోటార్‌ వద్ద రెండు నట్లు వూడిపోయినట్లు గమనించారు. ఆ మిక్సీని తెరిచి చూడగా మోటార్‌ ప్రాంతంలోని భాగాలు తొలగించి అందులో ఇమిడిపోయేలా కరిగించి పోసిన బంగారం అచ్చులు కనిపించాయి. ఈ అచ్చుల బరువు సుమారు 1.29 కిలోలు ఉన్నట్లు సమాచారం. ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.