పెళ్లి కాలేదు అని చనిపోయిన ఓ వ్యక్తి

SMTV Desk 2017-07-13 13:08:20  suicide,marrege,ananatapur,

గుత్తి : జూలై 13 : గుత్తి ఆర్ఎస్ లోని నాలగడ్డ గ్రామం వంకగడ్డ వీధికి చెందిన ఇర్ఫాన్‌ఖాన్‌(28) అనే వ్యక్తి పెళ్లి కాలేదని మాధనపడుతుండేవాడు. ఈ క్రమంలో ఆరోగ్యం కుడా దెబ్బతినింది.పెళ్లి కాలేదనే ఆలోచనతో మనోవేదనకు గురయ్యాడు. దీనికి తోడు ఇటీవలే తన తమ్ముడికి పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఇర్ఫాన్‌ఖాన్‌. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. చెట్టంత కొడుకు చనిపోవడం తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐలు చాంద్ బాషా,సుధాకర్ లు పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.