మహిళా పై అత్యాచారం

SMTV Desk 2017-07-13 10:58:20  Auto, drivers, raped, on, woman

కాకినాడ, జూలై 13 : ముగ్గురు ఆటో డ్రైవర్లు బస్సు స్టాప్ లో ఉన్న ఓ మహిళ పై అత్యాచారం చేసిన ఘటన మంగళవారం రాత్రి కాకినాడలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలు తుని మండలం ఆమె వయస్సు (23) సంవత్సరాలు ఈ నెల 3 న క్రితం ఆమె భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చి స్నేహితురాలి ఇంట్లో ఉంటుంది. 3 రోజుల క్రితం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుంది. చేతిలో డబ్బులు లేకపోయేసరికి ఆకలిని భరిస్తూ కాంప్లెక్స్ లోనే ఉంటుంది. ఇది గమనించిన ఓ ఆటో డ్రైవర్ మరో ఇద్దరి సహాయంతో బాధితురాలిని కాంప్లెక్స్ కు ఎదురుగా ఉన్న వంతెన కిందికి తీసుకెళ్ళి ఈ అగాయిత్యానికి పాల్పడ్డారు. రక్తస్త్రావం అవుతున్న ఆమెను కాంప్లెక్స్ కు కొద్ది దూరం వదిలేసి పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు నీళ్ళు తాగించి అంబులెన్స్ లో కాకినాడ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం చేసేందుకు వివరాలు అడుగుతుంటే అందుకు ఆమె అంగీకరించలేదు. నిందితుల పేర్లు తనకు తెలియవని కాని వాళ్ళను చుస్తే గుర్తుపడుతానని ఆమె వైద్యులకు చెప్పిందట.