కలెక్టర్లతో సీఎం కేసిఆర్ సమావేశం

SMTV Desk 2018-04-21 18:50:44  Cm Kcr, collectors meeting, pragathi bhavan

హైదరాబాద్‌, ఏప్రిల్ 21: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశ౦ ప్రారంభించారు. రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ అంశం ప్రధాన అజెండాగా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. వచ్చే నెల పదో తేదీ నుంచి చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... అందుకు సంబంధించిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనుంది. పంపిణీ కార్యాచరణ, అనుసరించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయనున్నారు.