గ్రూప్‌-2 అభ్యర్థుల ఆందోళన

SMTV Desk 2018-04-21 12:08:33  Hyderabad, group 2 candidates, pragathi bhavan

హైదరాబాద్‌, ఏప్రిల్ 20: గ్రూప్‌-2 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు శనివారం ఆందోళన చేపట్టారు. నియామక ప్రక్రియలో కొనసాగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కలించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అభ్యర్థులను అరెస్ట్‌ చేసి గోషామహల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రూప్‌-2 పరీక్షా నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని లాయర్ల కమిటీ చెప్పినా నియామకాలు జరపకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు మే నెల నుంచి సెలవులు రానున్నందున ప్రభుత్వం చొరవ తీసుకుని, నియామకాలు చేపట్టాలని కోరారు.