కుంటాల జలపాతంలో గల్లంతైన యువకులు

SMTV Desk 2017-07-02 17:05:27  Waterfall Falls, Two Young people are gone, Picnic, Ansar, a person named Paijan

ఆదిలాబాద్, జూలై 2 : మిత్రులందరూ కలసి సరదగా విహార యాత్రకు వెళ్లితే చేదు విషాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద ప్రఖ్యాత గాంచిన విహార ప్రదేశమైన కుంటాల జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మిత్రులందరూ కలిసి విహార యాత్రకు రావడంతో అక్కడ కొద్ది సేపు సరదాగా గడిపారు. అందులో ఇద్దరు అన్సార్, ఫైజాన్ అనే వ్యక్తులు ఫొటోలు దిగేందుకు నీటిలోకి దిగుతుండగా కాలు జారి పడిపోయి గల్లంతయ్యారు. వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామానికి చెందిన వారు. వీరు తమ గ్రామానికి చెందిన మరో ముగ్గురు మిత్రులతో కలిసి విహార యాత్రకు వచ్చారు. వీరి వివరాల్లోకి వెళ్లితే... అన్సార్ బైక్ మెకానిక్ కాగా, ఫైజాన్ విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మిగితా ముగ్గురు మిత్రులు బీటెక్ చదువుతున్నారని సమాచారం.