రాజధానికి మీరాకుమార్

SMTV Desk 2017-07-02 12:55:03  hyderabad, meerakumar, 3rd july, congress

హైదరాబాద్, జూలై 2 : రాజధాని నగరానికి వస్తున్న మీరాకుమార్...భారత దేశ రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరకు రావడంతో యూపీఏ, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న మీరాకుమార్ సోమవారం రోజున హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. దళిత వర్గానికి చెందిన మీరాకుమార్ తో పాటు మరో దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరిలో ఎవరు రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్నుకోబడుతారో వేచ్చి చూడాల్సిందే. కాంగ్రెస్ తో సహా మరో 16 పార్టీల మద్దతును మీరాకుమార్ పొందడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె సమావేశం అవుతారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రయాణం అవుతారు.