డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలన

SMTV Desk 2017-07-02 12:46:24  telangana, state, dee, set, co convinar, sheshukumari

హైదరాబాద్, జూలై 02 : డీఎడ్ కాలేజీ లో సీట్ల కోసం జూలై 5 లేదా 6 నుంచి విద్యార్దుల సర్టిఫికెట్స్ పరిశీలన ఉంటుందని డీఈఈసెట్ కో కన్వీనర్ శేషు కుమారి తెలియ జేసారు. డీఈఈసెట్ ర్యాంకులు పొందిన విద్యార్దులు ఈ నెల 4 లోగా వారి దృవపత్రలతో తో రెడీగా ఉండాలని అన్నారు. శుక్రవారం డీఈఈ సెట్ ఫలితాలు విడుదల చేసారు. ఈ ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం ( తెలుగు మేథడాలజి) లో 8,282 మంది విద్యార్దులు పరిక్షలకు హాజరు కాగా వారిలో 6,340 మంది విద్యార్దులు హర్హత సాధించారు. ఇంగ్లీష్ మీడియం (ఉర్దూ మేథడాలజి) లో 310 మంది విద్యార్దులు హాజరైతే వారిలో 198 మంది హర్హత పొందారు. తెలుగు మీడియం లో 20,936 మంది విద్యార్దులు పరీక్షకు హాజరు కాగా వారిలో 16,171 మంది విద్యార్దులు హర్హులయ్యారు. ఉర్దూలో 2,311 మంది విద్యార్దులు హాజరు కాగా వారిలో 648 మంది విద్యార్థులు హర్హత సాధించినట్లు వారు వెల్లడించారు.