విడుదలైన పీఈ-సెట్ ఫలితాలు

SMTV Desk 2017-07-01 13:46:27  PE cet Results, State Higher Education Council Chairman Pipireddy released, on friday

హైదరాబాద్, జూలై 01 : ఇటీవల జరిగిన వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్షల (పీఈ-సెట్) ఫలితాలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ డీపీఈడీ పరీక్షలో టాప్‌-10లో 9 ర్యాంకులు అమ్మాయిలు సొంతం చేసుకోగా, బీపీఈడీలో టాప్‌-10లో 4 ర్యాంకులు కూడా అమ్మాయిలే సాధించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు కార్డు కోసం, దరఖాస్తులు చేసుకోవడానికి సంబధించిన వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన అడ్మిషన్‌ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఈ వివరాలను తెలుసుకోవడానికి www.tspecet2017.ac.in వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి సమాచారం అందించడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.