హైకోర్టులో శాసన సభ్యత్వాల రద్దుపై విచారణ..

SMTV Desk 2018-03-19 16:09:52  High court, congress leader, komatireddy venkatreddy, sampath kumar,

హైదరాబాద్, మార్చి 19 : కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ సభ్యత్వాల రద్దు కేసులో విచారణ కొనసాగుతుంది. అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభా వ్యవహారాల శాఖ తరపున అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం శాసనసభా సమావేశాల పరిధిలోకే వస్తుందని ఏజీ వాదించారు. సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినప్పుడు సభ్యత్వం రద్దు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుందని పేర్కొన్నారు. తమ వద్దనున్న దృశ్యాలను సమర్పించేందుకు సిద్దంగా ఉన్నామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఘటనకు సంబంధించిన వీడియో పుటేజీని ఈ నెల 22లోగా సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వారం రోజుల్లోగా పూర్తి వివరాలు అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.