భోజనమే కాదు... నీరూ చవకే!!

SMTV Desk 2017-06-28 17:09:24  telangana, GHMC, hyderabad, 1

హైదరాబాద్, జూన్ 28 : ఫ్లాష్ .... ఫ్లాష్ .... ఫ్లాష్ .... హైదరాబాద్ వాస్తవ్యులకు ఒక మంచి వార్త. జీహెచ్ఎంసి మన కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. పేద ప్రజల కోసం చాల వాటిని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రూ. 5/- కే భోజనాన్ని అందిస్తూ, ఎంతో మంది ఆకలి తీరుస్తున్న జీహెచ్ఎంసీ...మరో ముందడుగు వేసి పేద ప్రజల కోసం కేవలం రూ.1/- కే లీటర్ సురక్షిత తాగునీటిని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యం లో మంచి నీటి శుద్దికేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను చేపట్టింది. పర్యావరణానికి హాని కలుగకుండా, రసాయనాలను ఉపయోగించకుండా నీటిని శుద్దిచేసే కేంద్రాలకు అప్పగించనున్నారు. జీహచ్ఎంసీ పరిధిలోని బస్టాపులు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలందు ఈ తాగునీటి కేంద్రాలను అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించడానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.