కేసీఆర్ కు తప్పిన ప్రమాదం

SMTV Desk 2018-02-27 13:23:46  kcr, helicopter incident, wire less battery, karimnagar

కరీంనగర్, ఫిబ్రవరి 27 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెనుప్రమాదం తప్పింది. సీఎం ప్రయాణించే హెలికాప్టర్ లో ఓ వైర్ లెస్ సెట్ లో బ్యాటరీ నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ బ్యాగును సుమారు 100 మీటర్లు దూరంలో పడేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందని అక్కడ ఉన్న భద్రత సిబ్బంది, ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.