మెట్రో ప్రయాణికులకు శుభవార్త..!

SMTV Desk 2018-02-27 12:19:04  metro trains, monthly pass, minister ktr, metro md svs reddy.

హైదరాబాద్, ఫిబ్రవరి 27 : మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఇక నుండి మెట్రో ప్రయాణికులకు త్వరలోనే నెలవారీ పాసులను అందించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించిన ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల అవసరార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంతో పాటు మరింత వేగంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఎల్‌ అండ్‌ టీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు.