తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు..

SMTV Desk 2018-02-26 16:16:06  ts eamcet, notification, chairman papireddy, hyderabad

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంసెట్‌ పరీక్షను తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష 10 గంటలకు అయితే విద్యార్థులు 9 గంటలకే సన్నద్ధం అయితే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. ఈ విషయంలో విద్యార్థులకు మీడియా అవగాహన కల్పించాలని కోరారు. ఎంసెట్‌ నిర్వహణ తేదీలు.. ఫిబ్రవరి 27న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల మార్చి 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం ఎంసెట్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్‌ 4 మే 2, 3 తేదీల్లో ఎంసెట్‌ మెడికల్‌ పరీక్ష మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష