వ్యవసాయం అనేది వ్యాపారం కాదు : కేసీఆర్

SMTV Desk 2018-02-25 15:52:26  cm kcr, professor jayashankar vyavasaaya university, auditorium.

హైదరాబాద్, ఫిబ్రవరి 25 : భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో రావాల్సిన సాంకేతిక మార్పులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అవగాహన కల్పించారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర వచ్చినప్పుడే నిజమైన పండుగ అన్న కేసీఆర్.. ఇందులో రైతు సమన్వయ సమితుల సభ్యుల పాత్ర చాలా ముఖ్యమన్నారు. "ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ బాధలు వర్ణనాతీత౦. కోటి ఎకరాలకు నీరందించే విధంగా శ్రమిస్తున్నా౦. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు నీళ్లివ్వలేదు. వ్యవసాయం అనేది వ్యాపారం కాదు. ఒక జీవన విధానం" అంటూ వెల్లడించారు. ఈ సారి రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే రైతులు బాగుపడే వరకు చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు.