నేటి విచారణతో రాంగోపాల్‌వర్మకు ఊరట..!

SMTV Desk 2018-02-23 12:57:28  ram gopal varma gst, web series, cyber crime police, investigation.

హైదరాబాద్, ఫిబ్రవరి 23 : వివాదాల దర్శకుడు రాంగోపాల్‌వర్మ తీసిన "జీఎస్టీ" వెబ్ సిరీస్ కు చాలా మంది మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ ని తొలగించాలంటూ పలు మహిళా సంఘాలు నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. దీంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు వర్మను మార్చి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలంటూ సమాచారమిచ్చారు. కాగా వర్మ కి చెందిన ల్యాప్‌టాప్‌ విషయంలో ఇంకా నివేదిక అందకపోవడంతో... పోలీసులు ఆయనను పూర్తి నివేదిక వచ్చాకే విచారించాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రస్తుతం దర్శకుడికి నేటి విచారణ నుండి కాస్త ఉపశమనం లభించింది. ఇటీవల సీసీఎస్‌లో మూడున్నర గంటలసేపు వర్మను విచారించారు. మరోసారి విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆదేశించగా.. తనను పోలీసులు రెండవసారి పిలవలేదని వర్మ ట్వీట్‌ చేశారు.