చట్నీస్‌లో అగ్నిప్రమాదం..

SMTV Desk 2018-02-18 10:32:16  chutneys restaurent, fire accident, hyderabad, short circuit

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 : నగరంలోని కూకట్‌పల్లి చట్నీస్‌ రెస్టారెంట్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్కూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన రెస్టారెంట్‌ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నసిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రెస్టారెంట్‌ పక్కనే జోయలక్కాస్‌ నగల దుకాణం ఉండటంతో నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద కారణంగా భారీ నష్టం సంభవించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.