హైదరాబాద్, జనవరి 30 : తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా గుర్తింపు పొందిన సామ్రాట్ పై వేధింపుల కేసు నమోదైంది. అతని భార్య ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా అతని భార్య హర్షితకు, ఆయనకు మధ్య విభేదాల తలెత్తడం వలన ఇరువురు రెండు నెలలుగా విడిగా ఉంటున్నారు. కాగా భార్య హర్షిత ఆయనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చి సీసీ కెమెరాలు, ఫర్నిఛర్ ధ్వంసం చేశాడని, ఇంట్లోని నగలు ఎత్తుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాదాపూర్ పోలీసులు సామ్రాట్‌రెడ్డిపై 498/A కింద కేసు నమోదు చేశారు. అనుష్క భర్తగా ‘పంచాక్షరి’ సినిమాలో నటించిన సామ్రాట్.. తకిట తకిట, బావా, దేనికైనా రెడీ లాంటి సినిమాల్లో నటించారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.