అంబేద్కర్‌, ఫూలే విధానాలే నా మార్గదర్శకాలు : పవన్

SMTV Desk 2018-01-24 18:01:14  pawan kalyan, janasena party, khammam tour.

ఖమ్మం, జనవరి 24 : సమాజానికి సేవ చేయాలనే సంకల్పం కలిగి ఉడుకు రక్తంతో ఉన్న యువత తమతో కలిసి రావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ప్రజా యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన పవన్ జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "జనసేన ద్వారా ప్రజా సేవ చేసేందుకే ప్రజల్లోకి వచ్చాను. ప్రతి దాడులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య కూడా ఒక కారణ౦. బీఆర్‌ అంబేద్కర్‌, ఫూలే విధానాలతోనే ముందుకెళ్తా. దేశంలో కులాలు అంతం కావాలి" అంటూ వ్యాఖ్యానించారు. అలాగే "జై తెలంగాణ", "జైహింద్‌" అన్న నినాదాలు తనకెంతో ఇష్టమన్నారు.